మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 17 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్బంగా ఈరోజు మమత హాస్పిటల్ నందు కేక్ కటింగ్ మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనైనది కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ 35 పార్టీలను ఏకం చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కడిగా బయలుదేరి రాష్టాన్ని సాధించారు 2023లో తెలంగాణ ప్రజలు కొంచెం తికమక్క పడ్డారు,ఇప్పుడు ప్రజలకు అర్థమైంది బీఆర్ఎస్ గురుకుల పాఠశాలలో కొన్ని వేల అప్లికేషన్లు వచ్చేవి కాంగ్రెస్ పాలనలో సరైన సదుపాయాలు లేక దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు కేసీఆర్ కు పేరు రాకూడదని కేసీఆర్ కట్టిన అంబేద్కర్ విగ్రహం దగ్గర గేట్లు ఓపెన్ చేయట్లేదు కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్లో రాత్రిపూట వర్క్ చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చారు కాంగ్రెస్ పాలనలో పేర్లు మార్పు తప్పితే ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నారు జరిగిన పొరపాటు కు చింతిస్తున్నారు14 నెలల్లోనే కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు కెసిఆర్ లాంటి పరిపాలన దక్షకుని కోరుకుంటున్నారు.అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే బీఆర్ఎస్ పార్టీఎక్కడ ఉన్నా ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు.కేటీఆర్ నాయకత్వంలో ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ముందుకు పోయింది లంగచర్ల గిరిజన రైతులకు కేటీఆర్ అండగా నిలిచారు కాంగ్రెస్ పాలనలో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు.రుణమాఫీ అరకొరక చేశారు.రైతుల పండించిన ఏ పంటకు కాంగ్రెస్ పాలనలో గిట్టుబాటు ధర లేదు 420హామీలు ఆరు గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా సరిగ్గా అమలు కాలేదు.ప్రజల ఆశపడి ఓటు వేశారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిలదీయాలి కెసిఆర్ సక్కగా నిలబడుడు కాదు తెలంగాణ సమాజాన్ని చక్కగా నిలబెట్టిండు.కేసీఆర్ ఆయు రారోగ్యాలతో నూరేళ్లు జీవించి తెలంగాణ సమాజం కోసం పాటుపడాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు,మాజీ డీసీసీబి చైర్మన్ కూరాకుల నాగభూషణంసీనియర్ నాయకులు ఆర్ జె సి కృష్ణ టేకులపల్లి సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్రారెడ్డి మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్ మండల అధ్యక్షుడు వీరునాయక్ మహిళా అధ్యక్షురాలు కొల్లు పద్మ,ప్రచార కార్యదర్శి షకీనా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రక్తదానం చేసిన వారిలో పిన్ని కోటేశ్వరరావు బొమ్మేర రామ్మూర్తిపల్లి ఉపేందర్ మాతంగి అనిల్ పోటు శరత్ మిరియాల రమేష్ మున్నా చంటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking