నేడు తూప్రాన్ లో సేవాలాల్ జయంతి ఉత్సవాలు .

 

తూప్రాన్ ఉత్సవాలలో పాల్గొననున్న మాజీ ఎమ్మెల్యే…..

కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే……

మెదక్ జిల్లా ఫిబ్రవరి 17ప్రాజబలం ప్రతినిధి :-

మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలోని సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు మంగళవారం తూప్రాన్ మునిసిపాలిటీ ఆవరణలో నిర్వహిస్తున్నామని అలాగే భోగ్ బండారు కార్యక్రమం శోభాయాత్ర మున్సిపాల్టీ ఆవరణ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఉంటుందని ఈ కార్యక్రమానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి , మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి ప్రతాపరెడ్డి మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా , పాల్గొననున్నారని లంబాడి ఐక్యవేదిక మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ తెలిపారు నాయకులు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking