నూతన వధూవరులను ఆశీర్వదించిన మేకల మల్లిబాబు యాదవ్ చిత్తారు సింహాద్రి యాదవ్

 

ఇల్లందు ప్రతినిధి ఫిబ్రవరి 17 (ప్రజాబలం) ఇల్లందు నియోజకవర్గo సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన రెడ్డి బోయిన తిరుపతిరావు మల్లిక ల కూతురు శ్రీహారిక సతీష్ యాదవ్ ల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ లు పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన యాదవులు జిల్లాలో యాదవ సంఘాల గ్రూపుల రకాలు గురించి చర్చించగా అఖిల భారత యాదవ మహాసభ 1924లో యాదవ మేధావులతో స్వాతంత్రం రాకముందే ఏ సంఘాలు పుట్టకముందే కేవలం అఖిల భారత యాదవ మహాసభ ఒక్కటే స్థాపించబడిందని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా విస్తరించిందని అఖిల భారత యాదవ మహాసభ జండా క్రింద ఈనాడు ఉత్తర భారత దేశంలో ప్రభంజనం సృష్టిస్తున్నాయని, భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్నాయని, మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులుగా పని చేశారని, అయితే ఈనాడు కొంతమంది స్వార్థం కోసం కొత్త సంఘాలు పెట్టుకుంటున్నారని ఒకప్పుడు వాళ్లు కూడా అఖిల భారత యాదవ మహాసభ జెండా కిందనే తిరిగారని, ఏదో ఒక రోజు మళ్ళీ ఆ జెండా కిందికే రావాల్సిన అవసరం ఉంటుందని నాయకులు వ్యాఖ్యానించారు అఖిల భారత యాదవ మహాసభను అవహేళన చేయాలని ప్రయత్నిస్తే దానికి తగిన మూల్యం కూడా చెల్లించక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఇమ్మడి తిరుపతిరావు బండారు ప్రభాకర్, పుట్ట ఉపేందర్, డేగల ఉపేందర్ మాజీ ఎంపీటీసీ గడ్డం వెంకటేశ్వర్లు, దాసరి వెంకటేశ్వర్లు దాసరి లింగమల్లు, మారబోయిన రాము యాదవ్, మద్దె బోయిన రమేష్ మరియు ఇతర యాదవ సంఘం నాయకులు బంధువులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking