ఘనంగాఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు

-విద్యార్థులకు అన్నదానం చేసిన నాయకులు

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 30 :

చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా శనివారం సింగరేణి హైస్కూల్లో ఉన్న మనోవికాస్ స్కూల్లో విద్యార్థుల సమక్షంలో కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేసిన అనంతరం విద్యార్థులకు అన్నదానం చేసారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, చెన్నూరు మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలు, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సోతుకు సుదర్శన్ లు మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి మచ్చలేని వ్యక్తి అని వారి కుటుంబం ఎల్లప్పుడూ ప్రజల కొరకే పోరాటం చేసే మనస్తత్వమని అన్నారు. వివేక్ వెంకటస్వామి మొదటి నుండి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు బెంచీలు ప్రతి వార్డులలో బోర్లు వేయించడం జరిగిందన్నారు. వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ లో వార్డులలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వాటిని అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉంటూ చెన్నూరు నియోజవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకు వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నెరువట్ల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లూరు లక్ష్మణ్, మహిళా పట్టణ అధ్యక్షురాలు గడ్డం రజని, మండ భాస్కర్ గోగుల రాజయ్య, సంగి సదానందం, పైడిమల్ల నర్సింగ్, కనకం రాజు, మంకు రమేష్, రాచర్ల రవి, నామిని ముత్తయ్య, మహంతి అర్జున్, రావుల శ్రీనివాస్, బుర్ర ఆంజనేయులు గౌడ్, ఆకారం రమేష్, పిండి ఐలయ్య, కడారి వీరస్వామి, జమాల్పూర్ నర్సోజి, కడలి శ్రీనివాస్, రేగుల శ్రీనివాస్, తిరుమల్, ఎర్ర రాజు, దుర్గం ప్రభాకర్, కొలిపాక సదానందం, జావిద్ ఖాన్, ఎండి ఇసాక్, రాయబారం కిరణ్, వీరన్న, బండి శంకర్, శ్రీనివాసు, అందుగుల లక్ష్మణ్, డాక్టర్ లింగన్న, వేటూరి సత్యనారాయణ, ఎండి సుకూరు, రాచర్ల గణేష్, మహిళా నాయకురాలు పోచంపల్లి లక్ష్మి, స్వరూప, కవిత, సమత, శంకర్, జంగపల్లి రాజేష్, సామ్యూల్, లక్ష్మణ్, పిడుగురాళ్ల వెంకన్న గజ్జల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking