రైతు భరోసా రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి

TRS ( D) రాష్ట్రఅధ్యక్షులు నరాల సత్యనారాయణ

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి నవంబర్ 29 (ప్రజాబలం) రైతు భరోసా రైతు రుణమాఫీని ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలి. పంటల బీమాను రైతులకు వర్తింపజేయాలి. ధాన్యం కొనుగోలు కోసం గిడ్డంగులను, మార్కెట్ యార్డులను సిద్ధం చేయాలి. ఉచిత విద్యుత్తు కోసం రైతులకు సబ్సిడీ చెల్లింపు చేయాలి. రైతు భరోసా కింద పూర్తిస్థాయిలో రైతులకు నిధుల పంపిణీ చేయాలి. రైతు బీమా ప్రీమియం చెల్లింపు చేయాలి. గత ఏసంగి ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి రైతులకు వాగ్దానం చేసినట్లుగా ప్రతి రైతన్నకు రెండు లక్షల వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలి. ఎకరాకు రెండు విడతలుగా 15000 వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నరాలసత్యనారాయణ డిమాండ్ చేశారు రైతన్నల సంక్షేమానికి, రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయాలని, కౌలు రైతులను కూడా ఆదుకోవాలని, కౌలు రైతులకు కౌలు భద్రతా చట్టం తేవాలని, పోడు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking