ఘనంగా ఇందిరా గాంధీ జయంతి

 

నగర కాంగ్రెస్ అధ్యక్షులు జావేద్ నివాళులు

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 19 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఆదివారం దివంగత మాజీ ప్రధాని, ఉక్కు మహిళా ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు మహమ్మద్ జావేద్, జిల్లా ఐ ఎన్ టి యు సి అద్యక్షులు కొత్తా సీతారాములు ఇందిరాగాంధీ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తు చేశారు.పేదరిక నిర్మూలనకు, మహిళల సంక్షేమానికి ఆమె తీసుకున్న నిర్ణయాలను వివరించారు. నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల మధ్యే కన్ను మూశారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షులు యడ్లపల్లి సంతోష్,జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజా హుస్సేన్,కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వరరావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొదిలి రవి, శెట్టి రంగారావు, రాష్ట్ర మైనారిటీ నాయకులు బి యచ్ రబ్బానీ, వైరా నియోజకవర్గ ఎల్డిఎం కో ఆర్డనేటర్ మద్దినేని రమేష్, జిల్లా మైనారిటీ నాయకులు రఫీ,జిల్లా ఓబిసి సెల్ ఉపాధ్యక్షుల గజ్జిసూర్యనారాయణ, రాములు నాయక్ సంపటం నరసింహారావు మహమూద్, మజాహిద్దిన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking