కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ వెంకట స్వామికి తెలంగాణ మాల మహానాడు మద్దతు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 19 : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లలోతెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కుంభాల రాజేష్,ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ వెంకటస్వామి మాలలందరు ఒక తాటి మీధికి వచ్చి భారీ మెజార్టీతో
గెలిపించాలని అన్నారు.గతంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాలభవన్ కోసం మాట ఇచ్చి నెరవేర్చకపోవడం బాధాకరమని భవిష్యత్తులో మాలలు బాగుపడాలంటే మాల జాతి బ్రతికి ఉండాలంటే గడ్డం వినోద్ వెంకట్ స్వామి గెలిపించి మాలల సత్తా తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బని రాజనర్సు,బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దాసరి ప్రతాప్,గౌరవ అధ్యక్షులు సుంకిత సమ్మయ్య, నంది కొమురయ్య, మహిళా జిల్లా అధ్యక్షురాలు దాసరి జయ,ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు గుర్రం ప్రదీప్, నియోజకవర్గ అధ్యక్షుడు ఎరుకల శ్రీనివాస్,బందెల శాంతి,మురళి,నియోజకవర్గ అధ్యక్షురాలు లింగాల అమృత,బెల్లంపల్లి పట్టణ ఉపాధ్యక్షులు కాపురపు కిరణ్,పట్టణ కార్యదర్శి రామిల్ల ప్రదీప్,చీటి పొశం,నాయకులు ఆసాది మురళి కే యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking