ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 19 :
బీఆర్ఎస్ కో ఆప్షన్ సభ్యులు షాహిద్ ఆలీ కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది.ఆదివారం
మంచిర్యాల నియోజకవర్గంలో లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని మైనారిటీ నాయకులు,కో ఆప్షన్ సభ్యులు షాహిద్ అలీ మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం,దండేపల్లి మండల ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.