మంచిర్యాల బీఆర్ఎస్,బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ చేరికలు

పార్టీలోకి ఆహ్వానంచ్చిన ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 19 : మంచిర్యాల బీఆర్ఎస్, బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది.ఆదివారం
మంచిర్యాల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు ముత్తి నేని రవికుమార్, బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు బోయిని పద్మ శ్రీనివాస్,బిజెపి నాయకులు బొడగుంట ప్రభా,తాడురి పోచం,సంపత్,మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా చేరిన వారు మాట్లాడుతూ…ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది అని తెలుపారు.అంతేకాకుండా మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గెలుపు కోసం మా వంతుగా కృషి చేస్తామని చెప్పారు.ఈసారి మంచిర్యాల నుండి గెలిచే ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,పట్టణ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking