చేగుంట :21/06/24 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్ల చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చేగుంట మండల నోడల్ ఆఫీసర్ నీరజ మాట్లాడుతూ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించాలని 69వ జనరల్ అసెంబ్లీ సమావేశం లో డిసెంబర్ 11, 2014న ఐక్య రాజ్య సమితి తీర్మానం చేసింది అని, యోగా వలన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని, మానసిక ప్రశాంతత కలుగుతుందని, శారీర ఒత్తిడిని తగ్గిస్తుందని వారు అన్నారు . ఈ కార్యక్రమంలో శారద , మనోహర్ రావు, చల్లా లక్ష్మణ్, వెంకటేష్,రేఖ, రమా, రాజేశ్వర్,సుధాకర్ రెడ్డి, రఘుపతి, సురేందర్,రాధా,రమాదేవి సరస్వతి , శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.