జిల్లా ప్రజలందరికీ మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు

జిల్లా ఎస్.పి .డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్

ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా ప్రతినిధి
17.10.2024:

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి .డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. గ మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని మహర్షి వాల్మీకి గారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ… శ్రీ రాముడి దివ్య చరిత్రను మానవాళికి అందించిన వాల్మీకి మహర్షి మానవీయ విలువలను ప్రతిపాదిస్తూ ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన జ్ఞాన ఘని అని వేదాల సారాంశాన్ని, రాముని ఆదర్శాన్ని ప్రపంచానికి రామాయణం రూపంలో అందించిన “ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి” సందర్భంగా జిల్లా ప్రజలందరికీ మహర్షి వాల్మీకి జయంతిని శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రామాయణాన్ని రచించి, ఆది కవిగా పేరు ప్రఖ్యాతలు గావించిన వాల్మీకి మహర్షి సంస్కృత సాహిత్యంలో అతను మొదటి పురాణ గాథను రచించారు కాబట్టి ఆయనకు ఆదికవి అనే బిరుదు ఉంది. వాల్మీకి రచించిన రామాయణానికి జీవితంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలు నేర్పే.. జీవిత పాఠంగానూ గుర్తింపు ఉందని అన్నారు మహర్షి వాల్మీకి గారికి నివాళులు అర్పించిన వారిలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎస్. మహేందర్ మినిస్టీరియల్ సిబ్బంది సూపరింటెండెట్ శ్రీమతి.మణి , .వలియా నాయక్ , అనురాధ , సలీం, సాగర్ , సిసి . శ్రీనివాస్ రెడ్డి గారు, ఎస్బీసిఐ సందీప్ రెడ్డి , ఆర్.ఐ .శైలేందర్ , ఎఆర్ ఎస్.ఐ నరేష్ భవానీ కుమార్ మహిపాల్, గారితో పాటు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking