ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అక్టోబర్ 17:గ్రూప్ 1 మెయిన్ పరీక్షల నిర్వహణపై సచివాలయం నుండి చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. TGPSC చైర్మన్ మహేందర్ రెడ్డి, సభ్యులు తన కార్యాలయం నుండి, సెక్రటేరియట్ నుండి పాల్గొన్న డీజీపీ జితేందర్. TGPSC కార్యదర్శి నవీన్ నీకోలస్. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు,అధికారులు కర్ణన్, ముషరాఫ్ అలీ పాల్గొన్నారు.
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా నుండి 17,762 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. జిల్లాల్లో గుర్తించబడిన 27 పరీక్షా కేంద్రాలలో నియమించబడిన ఛీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, డిపార్ట్ మెంటల్ అధికారులు, డిస్ట్రిక్ట్ అధికారులు, రూట్ ఆఫీసర్లందరికిఈ నెల 15 న సమావేశం ఏర్పాటు చేసి వారు నిర్వహించాల్సిన విధుల పట్ల సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టరు తెలిపారు. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు కార్యాలయము నుండి అదనపు కలెక్టరు రాధికా గుప్తా, డిఆర్ఓ హరిప్రియ పాల్గొన్నారు.