అర్హులైన ప్రతి పట్టభద్రులు ఓటరుగా నమోదుచేసుకోవాలి

 

జిల్లాలో తాసిల్దార్ కార్యాలయాల్లో ఓటరు నమోదు కేంద్రాల ఏర్పాటు

డిగ్రీ-2021 నవంబర్ లోపు పూర్తి చేసిన వారు అర్హులు

ఓటర్ నమోదు తేదీలు2024 సెప్టెంబర్ 30 నుండి ,నవంబర్ 06 తేదీ వరకు

ప్రజాబలం దినపత్రిక
మెదక్ హవెలిగానపూర్
17.10.2024:
హవేలీ ఘన్పూర్ మండలం తాసిల్దార్ కార్యాలయంలో ఓటు హక్కు నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పట్టభద్రులు, శాసనమండలి ఎన్నికకు ఓటరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు.
గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హవేలీ ఘన్పూర్ మండలం తాసిల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటరు నమోదుపై ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం,ఉమ్మడి మెదక్- నిజామాబాద్- అదిలాబాద్- కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం సంబంధించి అర్హత కలిగిన జిల్లాలోని తాసిల్దార్ కార్యాలయంలో ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు.
1.11.2021 కంటే ముందు డిగ్రీ, ఏదేని తత్సమాన అర్హతలు కలిగిన పట్ట భద్రులు, డిగ్రీ మెమో,ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ ,ఓటర్ ఐడి ,పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అవసరం ఉంటాయన్నారు.
అర్హులైన పట్ట భద్రులు ఫారం 18 తమ దరఖాస్తులను సంబంధిత సర్టిఫికెట్లను జత చేస్తూ తహసిల్దార్ కార్యాలయం, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం నందు మాన్యువల్ గా లేదా ceotelangana.nic.in అనే వెబ్ సైట్ లో ఆన్లైన్ ద్వారా నవంబర్ 6 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 23 న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రచురించాలని, డిసెంబర్ 9 లోపు డ్రాఫ్ట్ జాబితా పై అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్ 25 లోపు పరిష్కరించాలని, డిసెంబర్ 30న తుది ఓటర్ జాబితా ప్రచురించాల్సి ఉంటుందని అన్నారు.
తాసిల్దార్ కార్యాలయాల్లో ఓటరు నమోదు ఫారాలు ఉచితంగా అందచేయనున్నట్లు తెలిపారు. పూరించిన దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో అందచేయాలని సూచించారు. నవంబర్ 6వ తేది వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉన్నదని,
అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు గా నమోదు కావాలని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking