మహనీయుల జీవితాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి..

 

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా ప్రతినిధి
17.10.2024:
సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో వాల్మీకి జయంతి, కొమరం భీం వర్ధంతి సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్
గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొమరం భీం వర్ధంతి చిత్రపటాలకు పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వాల్మీకి జయంతిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ మహాకవి వాల్మీకి హిందూ ధర్మానికి అతి ముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని రచించారని.. దాని ద్వారా సమాజానికి అనేక విలువలను అందించారని. మానవీయ విలువలను ప్రతిపాదిస్తూ ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన జ్ఞాన ఘని.. మహర్షి వాల్మీకి* కలెక్టర్​ పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ఆదర్శ కావ్యం రామాయణమని..అలాంటి రామాయణాన్ని రచించిన వాల్మీకి జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా స్ఫూర్తిని పొంది, వారి మార్గంలో పయనించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించగలుగుతామన్నారు .
అనంతరం కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వర్ధంతి వేడుకలలో నిర్వహించారు. ఆదివాసి ఆత్మగౌరవానికి ప్రతీక కొమరం భీమ్ అని జల్, జంగల్, జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు.తమ భూమిలో తమదే అధికారం అని (భూమి. అడవి.నీరు మాదే) అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య,వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నాగరాజుగౌడ్, గిరిజన సంక్షేమ అధికారి, సంబంధిత నాయకులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking