మూడ్చింతలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్
భారత సత్యనారాయణ పదవీ విరమణ వేడుకలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ టి. రఘునాథస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా,
డాక్టర్ రఘునాథస్వామి మాట్లాడుతూ,
భారత సత్యనారాయణ ఆరోగ్యశాఖ కు చేసిన సేవలను కొనియాడారు, ఆయన ఆరోగ్య రంగంలో ప్రజలకు అందించిన నిస్వార్థ సేవలు ప్రశంసనీయమని, ఆయన పనితనం స్ఫూర్తిదాయకమని గుర్తుచేశారు. పదవి విరమణ పత్రాన్ని అందచేసి సన్మానం చేశారు.భారత సత్యనారాయణ
పదవీ విరమణ తరువాత కూడా ఆయన ఆరోగ్యానికి, ఆనందకర జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మరింత సేవ చేయడానికి వీలు కల్పించేలా ఆయన అనుభవాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కీసర డివిజన్ డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సత్యవతి, మూడ్చింతలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి
డాక్టర్ దామయంతి, అబ్రహాం, కాశీరాం తదితర సిబ్బంది పాల్గొన్నారు.