మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు
ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 5
సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి గొప్ప అధ్యాపకులుగా తత్వవేత్తగా రెండవ రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలు అందించిన ప్రజ్ఞశాలి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురుపూజోత్సవం జరుపుకుంటున్న అధ్యాపకులందరికీ హర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇల్లందకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు శ్రీరాములపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానం చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడు మంచి విద్యావంతులను తయారు చేయగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి సలీం విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.