ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ 6:
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలకు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మండపాల వద్ద కరెంట్, లైటింగ్ వంటి వైర్ల దగ్గర జాగ్రత్తగా ఉంటూ ఏలాంటి ప్రమాదాలు జరుగకుండా చూసుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. పండుగను భక్తి శ్రద్దలతో ఆనందంగా జరుపుకోవాలని కలెక్టరు అన్నారు.