జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి..

 

మండపాల ఏర్పాటులో పోలీస్ వారి సూచనలు పాటించాలి.

సోషల్ మీడియాలో వచ్చే పుకార్లును నమ్మొద్దు.

ఏ సమస్య వచ్చిన లోకల్ పోలీస్ వారికి లేదా డయల్ -100 కు కాల్ చేయండి.

జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712657888 సమాచారం అందించండి

జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

ప్రజాబలం దినపత్రిక – మెదక్ జిల్లా ప్రతినిధి
06-09-2024:

ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.. 7 వ తేది నుండి జరగబోయే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను, ఈద్ – మిలాద్- ఉన్ -నబీ,ఇతర పండగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. వినాయక చవితి మండపాల నిర్వాహకులకు, పీస్ కమిటి సభ్యులకు సూచించారు. ఒక మతాన్ని ఇంకో మతం వారు ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి ప్రశాంతమైన మెతుకు సీమగా పిలువబడుతున్న మెదక్ జిల్లాలో ఉన్నదని అది ఏంతో సంతోషకరమైన విషయం అని, ఈ అనవాయితీ నీ అలాగే కొనసాగించాలని అన్నారు.
రానున్న రోజుల్లో జరిగే పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇతర మతస్తులను గౌరవిస్తూ తమ పండుగలు శాంతి యుతంగా జరుపుకోవాలని, ఇలాంటి సమయాల్లో ప్రజలు తమ ఐక్యతను చాటుకోవాలని తెలిపారు అనుమతీ పొందిన మండపాలకు నిమజ్జనం వరకు పోలీస్ వారి సహకారం ఉంటుందని, ఇదివరకే అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పండగల సందర్బంగా చేయాల్సిన ఏర్పాట్ల పై ఆదేశాలు ఇవ్వడం జరిగిందనీ, పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటం జరుగుతుందని అన్నారు.
రాత్రి సమయాలలో మండపాల దగ్గర తప్పని సరిగా నిర్వాహకులు ఉండాలని, గస్తీ పోలీసులు కూడా అక్కడకు వచ్చి చెక్ చెయ్యడం జరుగుతుందని అన్నారు. నిమజ్జనం జిల్లా యంత్రాంగం సూచించిన ప్రదేశాలలో మాత్రమే జరుపాలని , నిమజ్జన ప్రదేశాలలో క్రెన్స్, బారికెడ్స్ వంటివి ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని అన్నారు.
పండుగల సమయంలో అక్కడక్కడా ఏమైనా చిన్న సంఘటనలు జరిగితే లోకల్ పోలీసుల దృష్టికి లేదా డయల్ -100 కు కానీ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712657888 సమాచారం అందించాలని అన్నారు.
ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే అలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా వివిధ కులాల మత పెద్దలు, మసీదులు, దేవాలయాలు, చర్చ్ ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.
గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వుంటుందని, ఇందుకోసం ముందుగా నిర్వహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం,నిమజ్జనం తేదీ,ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్
https://policeportal.tspolice.gov.in/index.htm ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీచేస్తారని తెలిపారు.వృద్ధులు,చదువుకునే విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా తక్కువ శబ్దకాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి.సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో ఎట్టిపరిస్థితులోను డిజేలను ఏర్పాటు చేయరాదని ఎస్పీ తెలిపారు.
మండపాల ఏర్పాటులో పోలీస్ వారి సూచనలు పాటించి ఏలాంటి ప్రమాదాలకు గురికాకుండా మండపాల నిర్వాహకులు చూసుకోవాలని, పండగలను ప్రశాంతంగా జరుపుకునేందుకు నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking