ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:రాష్ట్రంలో 27, 862 విద్యాలయాలకు ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తును అందిస్తుంది.
ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది.
ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11,062 పోస్టులకు నోటిఫికేషన్ వేయడంతో పాటు పరీక్షలు నిర్వహించడం జరిగింది.
రాబోయే రోజుల్లో మరో 6వేల పైబడి పోస్టులకు నోటిఫికేషన్ వేయడానికి భవిష్యత్తు ప్రణాళికను తయారుచేసి ముందుకు పోతున్నాం.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 45 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలు చేశాము. 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చాము.
పాఠశాలలో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు వేసి వాటి నిర్వహణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించి 667 కోట్ల రూపాయలను వెచ్చించింది.
ఈ ఆర్థిక సంవత్సరం శానిటేషన్ వర్క్స్ ఏర్పాటుకు 136 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాము.
రాష్ట్రంలో 63 ఐటిఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా ఏర్పాటు చేసి అదునాతన సాంకేతిక విద్యా బోధన అందిస్తున్నాం.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పన కోసం ఈ ఆర్థిక సంవత్సరం 300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు కేటాయించాం.
ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలలో గురువుల ఆలోచనలు కచ్చితంగా తీసుకుంటాం.
ఉపాధ్యాయులు, గురువులతో మాట్లాడి చర్చించిన తర్వాతే విధానపరమైన నిర్ణయాలు తయారు చేస్తాం.
ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ నిర్మాణం కావడానికి గురువుల పాత్ర కీలకంగా ఉపయోగపడాలి.
విద్యా బుద్ధులతో పాటు మంచి అలవాట్లు, సంస్కారం నేర్పించిన మానవ వనరులు సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను ఎదుర్కొని సమాజానికి ఉపయోగపడతారు.
సమాజం మనుగడ కోసం పునాదులు వేయాల్సింది గురువులే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007 సంవత్సరంలో ప్రభుత్వ బడులలో తెలుగు మీడియం తో పాటు ఆంగ్ల మీడియం చెప్పాలని ఆనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రోత్సహించి ఉపాధ్యాయులు అమలు చేయడం వల్లే నేడు ప్రపంచంతో పోటీ పడే విధంగా మన విద్యార్థులు రాణిస్తున్నారు.
సమాజ నిర్మాణంలో ప్రపంచంతో పోటీపడే విధంగా మానవ వనరులను తయారు చేయడానికి ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను అమలు చేయడానికి ఉపాధ్యాయులు సహకరించాలి.
అభ్యుదయ భావాలతో గురువులు ఉండటం వల్ల ఆ స్ఫూర్తితో ఈ రాష్ట్రం ప్రగతిశీలంగా అభివృద్ధి చెందుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో చాలామంది గురువులు గొప్ప వాళ్లు ఉండటం, ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగి ఉన్నందుకు సంతోషంగా గర్విస్తున్నా.
Prev Post