వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరగాలి
గణేష్ ఉత్సవాలకు శాంతియుత కమిటీ ఏర్పాటు
తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి.
తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్ల తూప్రాన్ మండలంలో, మున్సిపాలిటీలో పరిధిలోని గణేష్ ఉత్సవాలలో పోలీసు నిబంధనలను పాటిస్తూ భక్తి భావంతో గణేష్ మండపాల నిర్వహణ తప్పకుండా పాటించాలని తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి గురువారం రోజున అమర జ్యోతి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. డీజే లకు అనుమతి లేదని ఒకవేళ నియమన్ నిబంధనలు అతిక్రమించి డీజేలు ఉపయోగిస్తే గణేష్ మండపాల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనన్నారు. గణేష్ ఉత్సవాలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పోలీసులకు నిబంధనల ప్రకారమే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరగడానికి గణేష్ ఉత్సవ శాంతియుత కమిటీ బాధ్యతలు తీసుకోవాలన్నారు. డీజే లతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగా వద్దు అన్నారు. ఈ సందర్భంగా సిఐ రంగా కృష్ణ,ఎస్సై శివానందం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాలంటీర్ గా బాధ్యతలు గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి దుర సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మామిళ్ల జ్యోతి కృష్ణ మాట్లాడుతూ తూప్రాన్ పట్టణంలో గణేష్ ఉత్సవ శాంతియుత కమిటీ ఆధ్వర్యంలో అన్ని గణేష్ మండపాల వద్ద ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సాహాలు నిర్వహించుకునే విధంగా, గొడవలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువజన సంఘాల నాయకులు, యువకులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్,కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్ , భగవాన్ రెడ్డి ,మత్స్య శాఖ డైరెక్టర్ గడప దేవేందర్ మాట్లాడుతూ అధికారులు తెలిపిన ప్రకారమే వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసి మనం బాగుండాలని చూసే అధికారులకు అధికారులకు సహకరించాలన్నారు.ఈ సమావేశంలో ఎస్సై శివానంద్, తాసిల్దార్ విజయలక్ష్మి,ఎంపీడీవో శేషాద్రి,విద్యుత్ ఏఈ వరాలబాబు, కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్, జిన్నా భగవాన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్టణ అధ్యక్షులు పల్లెర్ల రవీంద్ర గుప్తా,నాగరాజుగౌడ్, బుడ్డ భాగ్యరాజ్,గరిగే నర్సింగరావు,మహ్మద్ అప్సర్,సోము యాదగిరి,,జింక మల్లేష్,రఘుపతి ఉమర్,అనిల్,నాగరాజ్, శ్రీనివాస్ యాదవ్,
సత్యనారాయణ బిజెపి నాయకులు దుర్గరాజు యాదవ్,జానకిరామ్ గౌడ్, మహేష్,రమేష్ బిఆర్ఎస్ నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, యువకులు,గణేష్ ఉత్సవాల కమిటీ నిర్వాహకులు మున్సిపల్ మేనేజర్ రఘువరన్,సిబ్బంది ఇర్ఫాన్, వినోద్, సిబ్బంది ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.