ఘనంగా మహిళా దినోత్సవం

 

చేగుంట 7/03/24 ప్రాజబలం న్యూస్ :-

మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చేగుంట మండల నోడల్ ఆఫీసర్ నీరజ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళలకు ఆర్థిక సమానత్వం తోనే సమ సమాజం సాధ్యమవుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో లలిత, రాధ,శారదా,సరస్వతి, రమ, శ్రీ వాణి, భవాని, సుమతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking