ప్రతి ఉపాధి కూలికి వంద రోజులు పని కల్పించాలి

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 07 : మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులలో ప్రతి ఉపాధి హామీ కూలికి వంద రోజులు పని కల్పించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు గురువారం జిల్లాలోని జైపూర్ మండలం ముదిగుంట లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులలో ఉపాధి హామీ కూలీలకు వందరోజుల పని కల్పించాలని తెలిపారు. వేసవి కాలం కావడంతో పని ప్రదేశాలలో త్రాగునీరు ఎంతో పాటు ఓ ఆర్ ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.జాబ్ కార్డు గల ఉపాధి కూలీలను పూర్తిస్థాయిలో పని కల్పించే విధంగా చర్య తీసుకోవాలని ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరిత గతిన పూర్తి చేసే విధంగా అధికారులు దృష్టి సాగించాలని తెలిపారు.అనంతరం జైపూర్ మండల తాసిల్దార్ కార్యాలయం నుండి నిర్వహించిన ఓటు హక్కు అవగాహన ర్యాలీలో జిల్లా గ్రామం అభివృద్ధి అధికారి కిషన్, మండల తాసిల్దార్ వనజారెడ్డి తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 18 సంవత్సరాల వయసు నిండి హోటకు కలిగిన ప్రతి ఒక్కరూ ఎలాంటి హలోబ్రమలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియాగించుకోవాలిని అన్నారు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి సాధ్యపడుతుందని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని 18 సంవత్సరాల నిండిన వారు ప్రభుత్వ కార్యాలయంలో పాటు ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ…మహిళలకు ఆర్థికంగా ఎదిగినప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుందని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంబంధిత శాఖ అధికారులు మహిళా సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking