ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా పాటింస్తుందని జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 07 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. గురువారం మంచిర్యాల లోని చింతపండు వాడలో గృహజ్యోతి పథకం కింద విద్యుత్ జీరో బిల్లును లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ…6 గ్యారెంటీ పథకాలు అమలు వల్ల ప్రజలకు ఎంతో ఆర్ధిక వెసులుబాటు కలుగుతుందన్నారు.విద్యుత్ వాడకం రెండూ వందల యూనిట్లు వాడితే కరెంట్ బిళ్లు ఫ్రీ వస్తుందన్నారు.అలాగే వంట గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తున్నానమని చెప్పారు.బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇంకా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా అర్హులు లబ్ధిపొందాలని సూచించారు.పథకాలు రాని వారు మున్సిపల్ కార్యాలయం లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు,కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
