కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మున్నూరు కాపు సంఘం నాయకులు.

 

కుత్బుల్లాపూర్ ప్రజా బలం న్యూస్ :-

మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల్ లో విలేకరుల సమావేశంలో ప్రెస్ మీట్ నిర్వహించినారు. మున్నూరు కాపు సంఘం యూత్ కన్వీనర్ పుప్పాల భాస్కర్ పటేల్ మరియు గౌరవాధ్యక్షులు మామిల్ల శ్రీనివాస్ పటేల్, తాటి రవీ కుమార్ ,బద్దం కిరణ్ కుమార్ , ముకుందరావు, యాదగిరి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ , ఎండీఎఫ్ ఫోరమ్ అధ్యక్షులు ఎడ్ల రవి పటేల్ గార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కొరకు గత ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరు కాపుల అభివృద్ధి కోసం బీసీలలో అన్ని కులాలకు పథకాల రూపంలో వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మా యొక్క మున్నూరు కాపుల కులాభివృద్ధి కోసం మాకు ఏమీ ఇవ్వలేదు కావున ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది.
గత ప్రభుత్వం ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు మూడు పార్టీలను మేని పోస్టులో కార్పొరేషన్ పెట్టాలని కోరడం జరిగినది, కానీ బిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు కార్పొరేషన్ ఊసు ఎక్కడ కూడా ఎత్తలేదు, కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 80 రోజులు పూర్తకాగా ,పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి, బాల బాలికల హాస్టల్, భవన నిర్మాణం కొరకు ఐదు కోట్ల రూపాయలు మరియు కోక పేట ఆత్మగౌరవ భవన నిర్మాణం కొరకు 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ను, ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబును, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్కను , సహచర మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ 64 మంది శాసనసభ్యులకు వినతి పత్రాలు అందజేస్తాము కావున పార్లమెంట్ ఎన్నికల ముందు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షులు శివ , రాష్ట్రా పబ్లిసిటీ సెక్రెటరీ సాయిని శ్రీనివాస్ , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు లక్ష్మినారాయణ , పందిరి యాదగిరి , దూలపల్లి సలహాదారు బుర్గుభవి సత్యనారాయణ , బద్దం కిరణ్ కుమార్ పటేల్, జగద్గిరిగుట్ట అధ్యక్షులు ఔచర్ల లక్ష్మీనారాయణ , గజులరామరం అధ్యక్షులు రావుల రాజు ,చింతల్ సంఘం అధ్యక్షులు నరేందర్ , చామంతి పూల శ్రీనివాస్ , వేషాల సంపత్ గారు ముకుందరావు , కిరణ్ , తాటి రవికుమార్, వీరన్న , మరియు కుల బాంధవులు ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking