ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 10 : రంజాన్ పర్వ దినాన్ని పురస్కరించుకొని వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని మున్సిపల్ కమీషనర్ కల్లెడ రాజశేఖర్ సిబ్బందికి సూచించారు.బుధవారం పట్టణంలోని క్లబ్ రోడ్డులో గల ఈద్గాను సందర్శించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…ఈద్గా పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు.అయన వెంట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.