ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 10 : వేసవిలో ప్రతి ఇంటికి నిరంతరంగా త్రాగునీరు సరఫరా చేసేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.బుధవారం మంచిర్యాల పట్టణంలోని గోసేవ మండల్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ,త్రాగునీటి సరఫరా నిర్వహణపై వివరములు అడిగి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి వేసే కాలం పూర్తయి వరకు త్రాగునీటి సరఫరాకు చేసేందుకు అధికారులు సమయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నిరంతరంగా నీటి సరఫరా చేసినందుకు కార్యచరణ ప్రకారం చర్యలు తీసుకుంటామని, నేటి సరఫరా సమస్యలు తలెత్తినట్లయితే త్వరిత గతిన పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. గ్రామపంచాయతీలో ఓ. హెచ్.ఎస్.ఆర్.ట్యాంకులు, పవర్ సోర్స్ పాయింట్ల ద్వారా సరిపడా నీటిని అందించడంతో పాటు మిషిన్ భగీరథ బోర్వెల్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రాంతాలను గుర్తించి రక్తం మాయ మార్గాలను నీటి ట్యాంకర్ల ద్వారా సరిపడా చేసినందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.పైప్ లైన్లు లీకేజీ సమస్యలు బోర్ వెల్ మరమ్మత్తులు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి నీటి సరఫరాను పున:రుద్ధరించేలా త్వరితగతిన పనులు చేపట్టాలని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రత అధికం అవుతున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సాధించే వచ్చే 3 నెలలు ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్,డి.ఈ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.