ప్రజా బలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 12 : కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సంక్షేమానికి బీజం పడిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు.ఆదివారం ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ… హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో సురేఖ ఇంటిటికీ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని వివరించారు.ప్రజలు అనేక సమస్యలను సురేఖ దృష్టికి తీసుకువచ్చారు.వార్డులో ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.అలాగే మురికి కాలువల సమస్య ప్రధానంగా ఉందని నిర్మాణం పూర్తి స్థాయిలో లేకపోవడంతో దుర్వాసన రావడంతో స్థానికులు అనారోగ్యాలకు గురవుతున్నారని సురేఖ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ ప్రజలకు మంచి రోజులు వస్తాయని సురేఖ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్,ఫ్లోర్ లీడర్ సురిమిల్ల వేణు,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తాళ్ల సంపత్ రెడ్డి,13వ వార్డు ఇంచార్జ్ దొమ్మటి కిరణ్,పట్టణ కార్యదర్శి దారవేణి తిరుపతి, నాయకులు రామ్మూర్తి,దేవేందర్, రజిత సునిత, రాజేశ్వరి,కలావతి, రిటైర్మెంట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.