తెలంగాణ హ్యాట్రిక్ సీఎం కే.సీ.ఆర్

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 20 అక్టోబర్ 2023: తెలంగాణ హ్యాట్రిక్ సీఎం కే.సీ.ఆర్ అని చేవెళ్ళ శాసన సభ్యునిగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాలే యాదయ్యనే గెలుస్తారని బీ.ఆర్.ఎస్ ఎంపీ డాక్టర్ జి.రంజిత్రెడ్డి చేవెళ్ళ పట్టణ కేంద్రంలో జరిగిన బీ.ఆర్.ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ మోజార్టీ మన చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో తీసుకురావాలని కార్యకర్తలకు ఉద్భోధించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వాన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయని చెప్పారు, మంత్రి కేటీఆర్ కృషితో పరిశ్రమల ఖిల్లాగా రంగారెడ్డి జిల్లా అవతరించిందన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ప్రజలను మభ్య పెడుతున్నదని చెబుతు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. బీ.ఆర్.ఎస్ పార్టీ అభివృద్ధికి చిరునామా అని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ కార్డులు ఉత్తమాటలేనని చెప్పారు. ఆరు నూరైనా గులాబీ జెండా రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా యావత్ తెలంగాణలో 100 సీట్లు సాధిస్తుందని తెలియ పరిచినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking