రాహుల్ గాంధీ రోడ్ షో అట్టర్ ఫ్లాఫ్- ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

 

జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 20: (ప్రజా బలం) జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద రాహుల్ గాంధీ నిర్వహించిన రోడ్ షో అట్టర్ ఫ్లాఫ్ గా నిలిచిందని,జనాలు రారని గ్రహించి ఇరుకైన ప్రాంతంలో ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. గ్రామాల నుండి పట్టుమని పది మంది కూడా రాలేదని,జగిత్యాల పట్టణం నుండి సైతం ప్రజలు హాజరవ్వలేదన్నారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి అభాసుపాలయ్యారని, మార్గమధ్యంలో నూక పల్లి వద్ద నిర్మించిన పేదోడి ఆత్మగౌరవ ప్రతీక అయిన రెండు పడకల గదులను చూడాల్సి ఉంటే బాగుండేదని అన్నారు…షుగర్ ఫ్యాక్టరీని2004 నుండి 2014 వరకు అధికారంలో ఉండి ఎందుకు తెరిపించలేదో చెప్తే బాగుండేదని,పసుపు బోర్డుకు సైతం నాడే మద్దతు ధర ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్..

Leave A Reply

Your email address will not be published.

Breaking