ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 20 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో గత రెండు రోజులుగా ఎక్సజ్ అండ్ ప్రోహిబిషన్ దాడుల్లో మద్యం,ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆశాఖ సీఐ బాబా శుక్రవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం,లక్ష్మీపూర్, మిట్టపల్లి,సూరారం గ్రామాల్లో అక్రమ మద్యం అమ్ముతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.10 క్వాటర్స్,25 డిప్ బాటిల్స్, బీర్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదే విధంగా గూడెం వద్ద ఒక వ్యక్తి నుంచి అక్రమ మద్యంతో పాటు రవాణాకు వినియోగిస్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీన పర్చుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.ఈ మద్యం విలువ సుమారుగా రూ.23 వేల ఉంటుందన్నారు.ఈ దాడుల్లో ఎస్సైలు రాబర్ట్, మౌనిక,సిబ్బంది పాల్గొన్నారు.