వడగాలులకు ఇంటి రేకులు కూలిపోయోన వారిని పరామర్శించి,ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల నియోజకవర్గంలోని
దండేపల్లి మండల అల్లీపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మారాజు సతీష్ ఇంటి రేకులు ఇటీవల వడగాలులకు కూలిపోగా ఆ విషయం తెలియగానే వారిని పరామర్శించి,వారి కి (50,000)/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. సోమవారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మారాజు సత్తిస్ ఇటీవల జరిగిన అకాల వర్షాల కారణంగా తన యొక్క ఇంటి రేకులు పగలడం జరిగిందని కార్యకర్తలు చెప్పడంతో వారిని పరామర్శించి,వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి జిల్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు,ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, సీనియర్ నాయకుడు తిరుపతి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల దుర్గ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు