ఓటర్ వివరాల టోల్ ఫ్రీ నెంబర్ 1950

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 1:
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో లోక్ సభ ఎన్నికల సందర్బంగ ఓటర్ వివరాల కొరకై కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ 1950 ఏర్పాటు చేయడం జరిగిందని మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజక వర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్ రూమ్ లో సిబ్బంది, పోలింగ్ స్టేషన్ ల నెంబర్ లు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లాలోని ప్రజలు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ వివరాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఫారం 6, 7, 8 గూర్చి సంక్లిప్త సమాచారం, ఓటర్ ఐ డి వివరములు పోలింగ్ స్టేషన్ వివరములు ఎపిక్ కార్డు వివరములు ఏ ఆర్ ఓ, ఇ ఆర్ ఓ / బి ఎల్ ఓ సూపర్వైజర్స్/బి ఎల్ ఓ తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలని కలెక్టర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking