మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 20 : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి అన్నారు. బుధవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధిగా నియామక పత్రాన్ని ఆయన అందుకున్నారు.ఈ సందర్బంగా బియ్యాల తిరుపతి మాట్లాడుతూ… గత ఎన్నికల్లో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గెలుపుకు కృషి చేశామని, ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పాటు పడతామన్నారు. అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చిన నావంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి, బొప్పు సతీష్,పట్టణ అధ్యక్షులు సాహిద్ అలీ,తుమ్మల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి,వివిధ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొని,అభినందనలు తెలిపారు.