ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ నియోజకవర్గం జనవరి 29:
విదేశాల్లో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు ను మాజీ సైనికుడు, యూత్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి సంతోష్ రెడ్డి, మాస్టర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేతలు సుధాకర రెడ్డి, హరిబ్రహ్మం, రామకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, అభిజిత్, భాను ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించినట్లు తెలిపారు. విదేశీ పర్యటనలో అనేక ముఖ్యమైన కంపెనీ లతో,ఒప్పందాలు కుదుర్చుకుని, రాష్ట్ర అభివృద్ధికి గర్వకారణం అన్నారు. విదేశీ పర్యటనలో భాగం గా మొత్తం 1,78,950 కోట్ల పెట్టుబడుల ను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించడమే కాకుండా 49,500 ఉద్యోగాల భరోసాను కూడా సాధించారని మంత్రి శ్రీధర్ బాబును కొనియాడారు. ఈ పెట్టుబడుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యత కలిగిన అగ్రరాజ్యాలలో బహుళ జాతి కంపెనీల తో భాగ స్వామ్యం గా మారింది అన్నారు. ఈ పర్యటనలో ఎన్నో ప్రముఖ కంపెనీ ల ప్రతినిధులతో మం త్రి సమావేశమై, రాష్ట్రంలోw పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితుల గురించి వివరి స్తూ, పారదర్శకతతో కూడిన పాలన, అవలంబ నీయమైన విధానాలను చూపించారు అని తెలిపారు. మంత్రి స్వదేశానికి, స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, ఈ ఘనతను అభినందిస్తూ సత్కరించామని అన్నారు. విజయవంతమైన పర్యటన తెలంగాణ రాష్ట్రానికి ఒక కొత్త మార్గదర్శకంగా నిలవడం తథ్యం అన్నారు.