ఖమ్మం ప్రతినిధి జనవరి29 (ప్రజాబలం) ఖమ్మం నాణ్యమైన ఉచిత విద్య అందించుటకు ప్రభుత్వ పాఠశాలల ను దశలవారీగా సెమి రెసిడెన్షియల్ స్కూల్ గా మార్చి, ప్రైవేటు పాఠశాలలను నిషేధించాలని ప్రధాన ఉద్దేశంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలొ పాల్గొంటున్నాం. 2014లో స్పెషల్ టీచర్ల వివరాలను సేకరించిన ప్రభుత్వం 10 సంవత్సరాలు అయినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నుండి స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి పెన్షన్ బెనిఫిట్ కు వర్తింప చేసినది, కానీ మన రాష్ట్రములో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఎమ్మెల్సీలు గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి పెన్షన్ కు బెనిఫిట్ కల్పించాలని ,317 జీవో వలన ఉపాధ్యాయ, ఉద్యోగులను స్థానిక జిల్లాల నుండి స్థానికేతర ప్రాంతాలకు బదిలీ చేసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు దీని మూలంగా దాదాపు 20 మంది ఉపాధ్యాయులు హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిన విషయం తెలిసినదే, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు గానీ, ఉపాధ్యాయ సంఘాలు గాని ఉపాధ్యాయ విద్యా సంక్షేమానికి పాటు పడక పోవడం మూలంగా విద్యార్థి దశ నుండి ఉద్యమాలలో పాల్గొన్నాను ఉపాధ్యాయుడిగా ఏపీటీఎఫ్, టి పి టి ఎఫ్ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పని చేసినాను పదవి విరమణ పొందినప్పటికీ ఉపాధ్యాయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటున్నాను అందుకే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయాలని అధ్యాపక, ఉపాధ్యాయ, తెలంగాణ ఉద్యమకారుల మద్దతో పోటీ చేస్తున్నాను . ఐదు సంవత్సరాలు పనిచేసిన ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే, ఎంపీలకు పెన్షన్ మంజూరు చేస్తున్నప్పటికీ 30 సంవత్సరాలకు పైగా ప్రజలకు సేవ చేస్తున్న ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వకపోవడం చాలా విచారకరం సి పి ఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ కొనసాగించాలి. మధ్యాహ్న భోజనం వలన ప్రధానోపాధ్యాయులు బోధనకు దూరమవుతున్నారు వారికి అకాడమిక్ పని మాత్రమే ఉండాలి, మధ్యాహ్నం భోజనానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు వేతనాలు ఒకటో తేదీ కాకుండా 17 – 20 తేదీలలో వేతనాలు చెల్లిస్తున్నారు . జీరో వన్ జీరో పద్దు పై మొదటి తేదీన వేతనాలు చెల్లించాలని , ఎయిడెడ్, గురుకుల, కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయు లందరికీ జీరో వన్ జీరో పద్దు ద్వారా వేతనాలు చెల్లింపు జరగాలి సమగ్ర శిక్ష ఉద్యోగు లందరినీ రెగ్యులర్ చేయాలి ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. విద్యావ్యవస్థను పూర్తిగా ఒకే బోర్డు క్రిందికి తీసుకురావాలి. గత సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలని , ఈ – కుబేర్ వ్యవస్థను రద్దు చేస్తూ ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారా బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించి, ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ల సాధనకు అన్ని సంఘాలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కారము నకు కృషి చేస్తాము అని అన్నారు . ఈ కార్యక్రమంలో పన్నాల గోపాల్ రెడ్డి , గుండెబోయిన నాగేశ్వరరావు , కాట్ల జగన్నాథం , సుభాని షేక్ తదితరులు పాల్గొన్నారు
