వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటనను విజయవంతం చేయాలి.

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 14 : రేపు మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా హాజరౌతున్న వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటనను ప్రజలు,నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలను మున్సిపల్ చైర్మన్ కాంతయ్య,వైస్ చైర్మన్ పోడేటీ శ్రీనివాస్ గౌడ్ లు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని విశ్రాంతి భవన్ లోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. రూ.8 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి భూమి పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లక్షెట్టిపేట,హజీపూర్,దండేపల్లి, జన్నారం,మండలాల ప్రజలకు వైద్య సాయం అందటంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు.హామీలు నెరవేర్చలేదనే ప్రతిపక్ష పార్టీల మాటలు అర్ధరహితమని వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కొట్టిపారేశారు. ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ లో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు కేటాయించినట్లు వివరించారు.అదే విధంగా త్వరలోనే అన్ని హామీలు నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.జిల్లా స్థాయిలో అందరిని ఆహ్వానించి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ కాంతయ్య తెలిపారు.ఈ సమావేశం లో బీ ఆర్ ఎస్ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్,దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,జిల్లా నాయకులు గోళ్ళ రాయమల్లు,సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking