మేడ్చల్ మార్చ్ 14 ; ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు ఆమోదం తెలుపాలని పలువురు మహిళా సంఘలనేతలు డిమాండ్ చేసారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ (ఐపిసి)ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కీసర మండలం కుందన్పల్లి లోని రామలింగేశ్వర స్వామి వికలాంగుల కాలనీ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలతో పాటు ముఖ్యంగా వికలాంగులు మహిళలు వృద్ధులు వయోవేదం లేకుండా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ (ఐపిసి) జాతీయ అధ్యక్షులు కే బి శ్రీధర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. నేడు సమాజంలో వికలాంగులు కూడా ఎందులో తీసిపోరని అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు కూడా వికలాంగులు తమ సత్తాను చాటుకుంటున్నారన్నారు. కానీ వికలాంగుల పట్ల సమాజం చిన్నచూపు చూస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలను గౌరవించాలని మహిళా వికలాంగులను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు అలాంటప్పుడే మహిళా దినోత్సవానికి మహిళా సాధికారికతకు సార్ధకత చేకూరగలదన్నారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన పంచ సూత్రాల ను ఆయన వివరించారు. అనతరం పార్లమెంటులో మహిళా బిల్లును పెట్టి అందులో వికలాంగుల కోటాను కేంద్ర స్థాయిలో రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నండూరి రమేష్ సమాజంలో మహిళలు వికలాంగుల పాత్ర గురించి ఆయన వివరించారు. ఐపీసీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శివలెంకల నాగ ఉదయ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో సమాజంలో సమాజానికి సేవలందిస్తున్న మహిళలను గుర్తించి వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉదయలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగ మహిళలకు త్వరలో చేయూతనిచ్చే కార్యక్రమాలను ఐపిసి తరఫున నిర్వహిస్తామని తెలిపారు.పార్ట్లమెంట్లో మహిళా బిల్లు పెట్టాలని, వికలాంగుల రిజర్వేషన్ ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్దిక, సామాజిక, రాజకీయ రంగాలలో వికలాంగ మహిళలకు రిజర్వేషన్స్ అమలుచేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం,షణ్ముఖ రావు,బస్ఖర్ రావు, శర్మ జీ రావు ప్రసన్న సుశీల పద్మ అల్లాజీ శర్మ కెవిఎన్ శర్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు.