ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులకు మార్గనిర్దేశం చేయడానికి కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 20:
ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులకు మార్గనిర్దేశం చేయడానికి కలెక్టరేట్లో ఎంఎస్ కార్యాలయాలలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) రాధికా గుప్తా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల కోసం జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లో, ఎంపిడిఓ, మున్సిపాలిటి కార్యాలయాలలో కూడా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఏలాంటి సందేహాలు ఉన్నఈ హెల్ప్ డెస్క్ లలో సంప్ర్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు అవసరమైన మేరకు డాక్యుమెంట్లు ఇవ్వని పక్షంలో ఇప్పుడు తీసుకుని ఎల్ఆర్ఎస్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆప్ (App) లో అప్లోడ్ చేయాలన్నారు. అవసరమైన మేరకు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking