తూప్రాన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కే శ్రీనివాస్ చారి.
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :- 11/02/2023 మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ గ్రామ పంచాయతీ ప్రక్కనే ఉన్న పాత మార్కెట్ ను అలాగే, అక్కడే కొనసాగాలని హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం ప్రజా విజయం”. అని తూప్రాన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు తెలంగాణ ఉద్యమ నాయకులు సామాజిక కార్యకర్త
కే శ్రీనివాస్ చారి అన్నారు. ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మాణాలు చేపట్టే ముందు ప్రజలను, లబ్ధిదారులను, గ్రామ పౌరులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. పాలనలో భాగస్వామ్యం ప్రజలకు ఉండడం అందుకే అత్యవసరం. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం ఉన్నతమైన స్థితికి చేరుతుంది. ఏక పక్ష నిర్ణయాలతో ఒరిగేది ఏమీ లేదు. నిజమైన అభివృద్ధి పేరుతో ప్రజాధనం ఖర్చు పెట్టేముందు ప్రజల సమ్మతి కచ్చితంగా తీసుకోవడం పాలకుల, అధికారుల కనీస ధర్మం. కమీషన్లు దండుకోవడం కోసమే అభివృద్ధి అన్నప్పుడు సమాజం చాలా ఘాటుగానే స్పందిస్తుంది. ఈరోజు తూప్రాన్ లో జరిగింది అదే అనే విషయం వేరుగా చెప్పనవసరం లేదు. తూప్రాన్ రైతులు, తూప్రాన్ కూరగాయల వ్యాపారస్తులు సంఘటితంగా, ఐక్యంగా, సుదీర్ఘంగా చేసిన పోరాట ఫలితాలు అందరికీ ఆదర్శంగా ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ చారిత్రాత్మక పోరాటంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో కూరగాయల వ్యాపారులకు, రైతులందరికీ వర్తిస్తుంది. వ్యాపారస్తులు, రైతులు సామరస్యంగా, శాంతియుతంగా ఉండాలి. పాలకులు, అధికారులు
పంతానికి పోకుండా వారికి కనీస సౌకర్యాలు కల్పించాలి అని తెలిపారు.