ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యం

 

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 25 :

చెన్నూరు పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌ను చెన్నూరు ఎమ్మెల్యే డా. వివేక్ వెంకటస్వామి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. అలాగే, తనకు కూడా లయన్స్ క్లబ్‌లో మెంబర్‌షిప్ ఉందని గుర్తుచేసుకున్న ఎమ్మెల్యే క్లబ్‌ సభ్యులతో కలిసి పనిచేసి సమాజానికి సేవ చేయడం గర్వంగా అనిపిస్తుందని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, లయన్స్ క్లబ్ సభ్యులు, వైద్య నిపుణులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking