కార్మికుల పక్షాన పోరాడే సంఘం ఐఎన్టీయూసీ

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 25:

కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం ఐ.ఎన్.టి.యూ.సి మాత్రమేనని ఐఎన్టీయూసీ నాయకులు దేవి భూమయ్య, రాంశెట్టి నరేందర్ లు అన్నారు. శనివారం కాసిపేట -1 గని పై జరిగిన ఐఎన్టియుసి బాయి బాట కార్యక్రమం నిర్వహించారు. సింగరేణిని కాపాడుకోవడానికి, సింగరేణిలో కొత్త బావులను తీసుకురావడానికి, కార్మికుల సొంతింటి కలను నిజం చేయడానికి, పర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ మాఫీ చేయడానికి జనక్ ప్రసాద్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని,ఐఎన్టీయూసీ తప్ప ఏ సంఘం కూడా కార్మికుల పక్షాన ఆలోచించిన దాఖలాలు కనిపించడం లేదని గుర్తింపు సంఘం కేవలం తమ స్వలాభం కోసం పనిచేస్తూ పైరవీలకే పరిమితమై కార్మికుల సమస్యలను అటకెక్కించారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మికులందరినీ కలిసి వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రామర్, లైన్మెన్ మరియు టెక్నీషియన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇతర కేటగిరీలకు చెందిన కార్మికులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు వారిపై పెరుగుతున్న పనిభారం గురించి చెప్పడం జరిగింది. అనంతరం గని మేనేజర్ గారిని కలిసి కార్మికుల సమస్యలను వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి వివరించి త్వరగా ఆ సమస్యలను పరిష్కరించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య పాటు ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్, కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బన్న లక్ష్మన్ దాస్, మేడ సమ్మయ్య, కాసిపేట్-1 గని నాయకులు ఎర్రబెల్లి శంకర్, సోగల కన్నయ్య, సంతోష్ పాండే, శ్రీకాంత్, రాజ్ కుమార్, కొమ్ము అనిల్,రాజేష్ ,అలీ, శ్రీమాన్ ,దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking