మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తం ఎన్నికల ప్రచార రథాల ప్రారంభం

 

* జెండా ఊపి ప్రచార రథాలను ప్రారంభించిన ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ

* అభ్యర్థి నీలం మధుకు విజయ తిలకం దిద్ది ప్రచార శంఖారావం పూరించిన మంత్రి కొండా సురేఖ.

* పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ శాసన సభ్యులు మైనంపల్లి హనుమంత రావు, tsiic చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

* సెగ్మెంట్ ను చాలెంజ్ గా తీసుకున్నాం

* కెసిఆర్, హరీష్ రావు లకు కాంగ్రెస్ సత్తా చూపిస్తాం

*కాంగ్రెస్ పటిష్టంగా ఉంది అని కార్యకర్తలు అందరూ నిరూపించాలి

* నీలం మధును గెలిపించి సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి

* రుద్రారంలో ప్రచార వాహన ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ
*
సంగారెడ్డి పటాన్చెరు ప్రజ బలం ప్రతినిధి:
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గెలిచిన మెదక్ గడ్డపై తిరిగి కాంగ్రెస్ జెండాను ఎగురవేయబోతున్నాం అని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ అన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథాలను పటాన్ చెరు మండలం రుద్రారం గణేష్ దేవస్థానం వద్ద మంత్రి కొండా సురేఖ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ఈ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ ను కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ గా తీసుకున్నదని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ మెదక్ సెగ్మెంట్ లో ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ సత్తాను చూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరుగ్యారెంటీ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది అని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేసి నిరూపించాలి అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో మెదక్ ఎంపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను తనకు అప్పగించారని తెలిపారు. ఎంపీ ప్రాతినిథ్యం తప్పనిసరని, ఎంపీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నాం అని అన్నారు.


మెదక్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగి, అభ్యర్థి నీలం మధును గెలుపునకు కృషి చేయాలన్నారు. రేపటి నుండి ప్రచారం ముమ్మరం కానుందని, ఎన్నికలలో విజయకేతనం ఎగురవేసి, సంబురాలు జరుపుకునేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి సురేఖ కార్యకర్తలకు సూచించారు.

కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్యే పోటీ…

* మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి..
*
ఈ ఎంపీ ఎన్నికలలో మెదక్ పార్లమెంటు పరిధిలో బిఆర్ఎస్ కాంగ్రెస్కు మధ్య పోటీ ఉంటుందని, ఇంకో పార్టీ పేరు కూడా తీయవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎమోషన్లకు పోయి ఆ పార్టీ వ్యక్తిని గిల్ల వద్దని కార్యకర్తలకు సూచించారు. బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని, అతని గెలుపు ఎంతో అవసరమని అన్నారు. ఇందుకోసం కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అడ్డా మెదక్…

* మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అడ్డా అని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీకి అరుదైన అవకాశం దక్కిందని, మిగతా అభ్యర్థులు ఇద్దరు కూడా అగ్రవర్ణ కులాలకు చెందిన వారేనని పేర్కొన్నారు. ఇందిరా ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ మెదక్ సీటుపై కాంగ్రెస్ జెండా ఎగరేసేంతవరకు నిద్రపోయేది లేదన్నారు. ఊహించని విధంగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మైనంపల్లి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పటాన్చెరు అసెంబ్లీ ఇంచార్జ్ శ్యామ్ గౌడ్, పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇంచార్జ్ లు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, మునిసిపల్, పట్టణ, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking