ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 12 (ప్రజాబలం) ఖమ్మం బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్థానిక మైనార్టీ నాయకులతో కలిసి ఖమ్మం నగరంలోని శుక్రవారపుపేట, బీకే బజార్ లోని మసీదుల వద్ద శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఓట్లు అభ్యర్దించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి గెలిపించాలని, పార్లమెంట్ లో ముస్లిం ల సమస్యలపై మరింతగా గళం విప్పుతానని ఈ సందర్భంగా అన్నారు. ఈ సారి కూడా మీరే రావాలి.. మీరే కావాలని, మీకే ఓటు వేసి గెలిపించు కుంటామని ముస్లిం మైనారిటీ సోదరులు స్పష్టం చేశారు. నామ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడిని ఆలింగనం చేసుకొని, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మైనార్టీ నాయకులు తాజుద్దీన్, ఫిరోజ్, ఫారూఖ్ హుస్సేన్, ఇజాద్,తౌశిఫ్, అప్షర్, బాబీ, మసీదు ఇమామ్ రెహ్మాన్, పార్టీ జిల్లా నాయకులు తాళ్లూరి జీవన్, నామ సేవా సమితి నుంచి రాజేష్, చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు