రెజొనెన్స్‌ స్కూల్‌ శ్రీనగర్‌లో ఘనంగా హోలీ వేడుకలు

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 23 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని స్థానిక శ్రీనగర్‌ కాలనీలో గల రెజొనెన్స్‌ స్కూల్‌లో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు రెజొనెన్స్‌ స్కూల్‌ శ్రీనగర్‌లో చిన్నారులు హోలీ వేడుకలలో పాల్గొని తమ స్నేహితులు, ఉపాధ్యాయులకు రంగులను చల్లుతూ ఒకరికి ఒకరు హోలి శుభాకాంక్షలు తెలుపుకుంటూ తమ స్వచ్చమైన మనస్సుతో ఆనందతన్మయత్వం చెందుతూ చిరునవ్వులను చిందిస్తూ రంగేళిని ఎంతో ఉత్సాహంగా కేరింతల నడుమ జరుపుకోవడం జరిగింది ఈకార్యక్రమం లో స్కూల్‌ డైరెక్టర్‌ కొండా శ్రీధర్‌ రావు పాల్గొని మాట్లాడుతూ హోలీ పండుగను కాముని దహనం అని కూడా అంటారని హోలి పండుగ దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలలో ఇది ఒకటి అంటూ ఈ పండుగ సత్యయుగం నాటి నుంచి జరుపుకుంటున్నా రంటూ హిందు పురాణాల ప్రకారం హోలీ అనగా అగ్నితో పునీతమైనదంటూ మనలోని చెడుకోరికలను ధహింపచేసుకొని సమాజ హితాన్ని కోరుతూ మతసామరస్యాన్ని పెంపొందింప జేసుకోవాలంటూ దేశాభివృద్ధిలో విద్యార్థులు కీలకమంటూ విలువలు, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దు తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా రెజొనెన్స్‌ స్కూల్‌ శ్రీనగర్‌ పనిచేస్తుందంటూ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారుఈ సందర్భంగా డైరెక్టర్‌ కొండా కృష్ణవేణి పాల్గొని హోలీ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేస్తూ విద్యార్థులకు పండుగల యొక్క ప్రాముఖ్యతలను
మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ విద్యార్థులందరూ ప్రకృతి హితమైన రంగులను మాత్రమే ఉపయోగించాలంటూ రసాయనికి రంగులను వాడి కాలుష్యాన్ని కలుగజేస్తూ ప్రమాదాలకు గురికావొద్దంటూ జాగ్రత్తల ను తెలియజేస్తూ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో స్కూల్‌ ప్రధానోపాధ్యాయు లు యం.ప్రసన్నరావు ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యేయేతర సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking