ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి 23:
ఐసిడిఎస్ మహాదేవపు ప్రాజెక్టు గంగారం మండలం సెక్టర్ శంకరంపల్లి అంగన్వాడి సెంటర్ టీచర్ విజయనిర్మల ఈనెల 17వ తేదీన గుండెపోటుతో మరణించరూ. ఆమెకు ఇద్దరు కూతుర్లు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఐసిడిఎస్ వరంగల్, హనుమకొండ సెంట్రల్ అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో శనివారం శంకరంపల్లి గ్రామంలోని విజయనిర్మల నివాసానికి చేరుకొని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, అంగన్వాడి టీచర్ కుటుంబానికి 18,800 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంగన్వాడి టీచర్ కుటుంబానికి అండదండగా ఉంటామని ఆమె ఇచ్చారు. పరామర్శించిన వారిలో ఐసిడిఎస్ వరంగల్ అర్బన్ లీడర్లు ఎండి నసిం, వి ఉమాదేవి ఐసిడిఎస్ హనుమకొండ సెక్టార్ నుండి పద్మాక్షి, డి సత్యవేదం, జి సునీత, కే ఇందిరా, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.