కన్నయ్య గూడెం ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క
ప్రజాబలం ములుగు ప్రతినిధి మార్చి 23:
ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వాన్ని మారుస్తారని అది తెలంగాణలో రుజువు అయిందని ఇక మిగిలింది కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడమేనని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం ములుగు నియోజకవర్గ కన్నాయిగూడెం మండలం లో కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.

కేంద్రంలోని బిజెపి, బారాసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోచుకు తిన్నారని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని ప్రజలకు కావలసిన పథకాలను అందిస్తున్నామని ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను ఇప్పటికే అమలు పరుస్తున్నట్లు పేర్కొన్నారు. వంద రోజుల్లో 200 యూనిట్ల ఉచిత కరెంటు మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ ,10 లక్షల ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లు లు, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. నియోజకవర్గానికి 3500 గృహాలను నిర్మించ తలపెట్టిందని, అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు కేంద్రంలోని బిజెపి 2022 నాటికి ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నిర్మించి ఇస్తామని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లుల నిర్మాణం ఉంటుందని చెప్పారని ఎక్కడ నిర్మించారు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోడీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోవడంలేదని కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి దీక్ష చేస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదని రైతులపైనే తుపాకులతో తూటాలు పేల్చారని విమర్శించారు. రైతులను బలి తీసుకున్న ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అని ప్రజలు ఆలోచించాలని రాబోయే ఎంపీ ఎన్నికలలో మహబూబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ ఎంపీ తాను కలిసి మహబూబాద్ పార్లమెంటు ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధిని సాధించగలమని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా బ్లాకు, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.