మెదక్ తూప్రాన్ మార్చ్ 25 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. తూప్రాన్ లోని జయ హనుమాన్ రియల్ ఎస్టేట్ కార్యాలయ ఆవరణలో సోమవారం ఉదయం చందాయిపేట తాజా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజు నేతృత్వంలో రంగుల పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
హోలీ పండుగ సందర్భంగా స్థానిక తూప్రాన్ డి.ఎస్.పి వెంకట్ రెడ్డి, సిఐ కృష్ణ, ఎస్సై శివానందం లను కలిసి హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజు, మహమ్మద్ అప్సర్, హనుమాన్ రియల్ ఎస్టేట్ యూనియన్ అధ్యక్షుడు పన్నీరు రాము మాట్లాడుతూ వసంత ఋతువు ఆగమనంతో వచ్చు తొలి వేడుక హోళీ అని తెలిపారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే హోళీ పండుగ అని అన్నారు. ప్రపంచములోని రంగులన్ని కలిసి చేసే కోలాహలం హోళీ అని తెలిపారు. హోళిక అనే రాక్షసిని సంహరించిన దినం హోళీ అని అన్నారు. అందుకే హోళీ సందర్భంగా యావత్ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్, ఆర్ఎంపి, మరియు పిఎంపి ల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అప్సర్, గడ్డం ప్రశాంత్ కుమార్, పన్నీరు రాము, గడ్డం శ్రీనివాస్, బోల్లబోయిన మహేష్ యాదవ్, దన్ రాజు ,నాయకులు శ్రీనివాస్ గుప్తా ,గడ్డం రవీందర్, గడ్డం శేఖర్, గడ్డం సతీష్, యూత్ నాయకులు గడ్డం రాకేశ్, కుమార్, నాగరాజు గౌడ్, నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.