కరీంనగర్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి: కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పీవీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లాప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ ను బార్ అసోసియేషన్ న్యాయవాదులు కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు హోలీ రంగులు ఒక రిపై ఒకరు చల్లుకుంటూ డీజే పాటలతో పలువురు న్యాయవాదులు డాన్స్లతో ఉల్లాసంగా, ఉత్సాహంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్య క్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు టి రఘువీర్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు డి మల్లయ్య, పెంచాల ప్రభాకర్రావు, కొరివి వేణు గోపాల్, బి రఘునందన్ రావు, సజన్ కుమర్,లింగంపెల్లి నాగరాజ్, హర్షవర్ధన్ రెడ్డి , గంజి స్వరాజ్ బాబు,ఆరెల్లి రాములు, కొత్త ప్రకాశ్ , ప్రదీప్ కుమార్ రాజ్,డి రాజశేఖర్రావు, కిరణకుమార్, గుజ్జా సతీష్, తిరుపతి రెడ్డి ల పాటు తదితరులు పాల్గొన్నారు.