లక్షెట్టిపేట లిటిల్ స్టార్ పాఠశాలలో ఘనంగా హోలీ సంబరాలు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 23 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని లిటిల్ స్టార్ గ్రామర్ స్కూల్లో ముందస్తుగా హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.శనివారం ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సంతపురి కిషోర్ కుమార్ మాట్లాడుతూ…హోలీ ఉత్సవ రోజున,ప్రజలు రంగుల పొడిని,రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు.ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ (హోలికను కాల్చడం) లేదా చోటీ హోలీ (చిన్న హోలీ) అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు.తెలుగు రాష్ట్రాలలో హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు.ఇది సాధారణంగా శీతాకాలం చివర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి ఫాల్గుణమాసము పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కొన్ని రోజుల తరువాత, ఫాల్గుణ బహుళ పంచమిన పండుగ ముగింపున సూచిస్తూ రంగులతో రంగ పంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారని హోలీ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటే ఆనందంగా హోలీ ఉత్సవాన్ని జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మహమ్మద్ హమీద్ మినుముల,శ్రీనివాస్ ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking