లక్షెట్టిపేట ఎస్సై పి చంద్రకూమార్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 23 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని హనుమంతుపల్లి గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఐ పీ ఎస్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు లక్షెట్టిపేట పోలీసుల అధ్వర్యంలో డయల్ 100 షీటీమ్,సైబర్ క్రైమ్, ఆత్మహత్యల పై కళాబృందంచే అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై చంద్రకుమార్ మాట్లాడుతూ… ఎలాంటి సమస్య ఉన్న 100 కు డయల్ కాల్ చేయాలని వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించుతారన్నారు.అదే విధం విద్యార్థినులు కాలేజీ వచ్చి,పోయే సమయంలో ఆకతాయిలు వేధింపులకు గురిచేస్తే సమస్యను షీ టీమ్ పోలీసు లకు తెలియజేయాలన్నారు.ఈ మధ్యకాలంలో ఆన్లైన్ లో చాలా మంది నష్టపోతున్నారని,ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు అడిగిన మీకు మీ తల్లితండ్రులకు ఫోన్ చేసి మీకు లోన్ ఇస్తమని చెబితే నమ్మకూడదన్నారు.ఎలాంటి పని ఉన్న నేరుగా బ్యాంక్ వెళ్లి సమస్యను పరిష్కరించుకోవలన్నారు. ఇతరులు ఫోన్ చేసి మీకు ఓ టీ పీ వచ్చింది చెప్పమంటే చెప్పకూడదన్నారు. అనంతరం కళజాతర బృందం నాటక రూపంలో,జానపద పాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై చంద్రకుమార్,కళాజాతర బృందం సభ్యులు,పోలీసులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.